శనివారం 06 మార్చి 2021
Yadadri - Oct 29, 2020 , 02:08:13

యాదాద్రి శివాలయం ప్రహరీపై నంది విగ్రహాలు

యాదాద్రి శివాలయం ప్రహరీపై నంది విగ్రహాలు

  •  ఆలయం చుట్టూ 32 ప్రతిమలు 
  • దక్షిణం వైపు 17, ఉత్తరం వైపు 15 
  • నందులకు తుది మెరుగులు 
  • పూర్తి కావొచ్చిన శివాలయం పనులు 

ఆలేరు : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వైటీడీఏ అధికారులు వేగం పెంచారు. ప్రధానాలయ ముందు భాగంలో ఫ్లోరింగ్‌ పనుల్లో వేగంపెంచారు. ఇక అనుబంధ ఆలయమైన శివాలయం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు శివాలయం ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపు ఉన్న ఆవరణంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా ఉండేందుకు శివాలయ ప్రధానాలయం ముఖమండపం చుట్టూ ఉన్న పిల్లర్ల మధ్యలో ఇత్తడితో తయారు చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌, గోడలకు తెల్ల రంగులు వేయడం దాదాపుగా పూర్తయింది. బుధవారం శివాలయం చుట్టూ ఉన్న గోడ పైన నంది విగ్రహాలను అమర్చే పనిలో పడ్డారు. గోడ చుట్టూ మొత్తం 32ఆకర్షణీయమైన నంది విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దక్షిణవైపు ప్రహరీకి 17, ఉత్తరం వైపు 15 నందులను అమరుస్తున్నారు. నేడో రేపో శివాలయం వెలుపుల భాగంలో ఫ్లోరింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. 

VIDEOS

logo