వైభవంగా సుదర్శన నారసింహ హోమం

- పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- శ్రీవారి ఖజానాకు రూ. 5,62,997 ఆదాయంవైభవంగా సుదర్శన నారసింహ హోమం
- పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- శ్రీవారి ఖజానాకు రూ. 5,62,997 ఆదాయం
ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం సుదర్శన నారసింహహోమం వైభవంగా జరిగింది. బాలాలయంలో నిత్య కైంకర్యాలు సంప్రదాయంగా కొనసాగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిఅమ్మవార్లకు పంచామృతాలతో నిజాభిషేకం చేశారు. అనంతరం పట్టవస్ర్తాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచి ఆరాధన, సహస్త్రనామార్చన, సువర్ణపుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు అష్టోత్తర పూజలు, బ్రహ్మోత్సవ వేడుకలు చేపట్టారు. ఆలయ మండపంలో ఉదయం , సాయంత్రం ప్రత్యేక సేవలు నిర్వహించారు. ఇక వ్రత మండపంలో నిర్వహించిన శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు మొక్కు పూజలు చేశారు.
ఖజానాకు రూ. 5,62,997 ఆదాయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 5,62,997 సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్ ద్వారా రూ. 37,276, రూ. 100 దర్శ నం ద్వారా రూ. 14,100, ప్రచారశాఖ ద్వారా రూ. 1,2 10, వ్రతాల ద్వారా రూ. 17,000, కల్యాణకట్ట ద్వారా రూ. 17,260, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 2,5 1,190, శాశ్వత పూజల ద్వారా రూ. 5,348, వాహనపూజల ద్వారా రూ. 9,600, టోల్గేట్ ద్వారా రూ. 2,260, అన్నదాన విరాళం ద్వారా రూ. 1,02,449, ఇతర విభాగాలతో రూ. 1,03,564 కలిపి మొత్తం రూ. 5,62,997 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- మరింత తగ్గిన బంగారం ధరలు
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!
- రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్ణాటక మంత్రి పూజలు
- ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు సోదరుడు హాజరు
- సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ఈస్తోనియా అంబాసిడర్ భేటీ
- ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు 89 పరుగుల లీడ్