‘ధరణి’తో తీరనున్న భూ సమస్యలు

ఆత్మకూరు(ఎం) : రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేవిధంగా ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసి ఈ నెల 29న ప్రారంభించబోతుండటం హర్షణీయమని రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటులో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందివ్వడంతో పాటు రైతులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి కావడంతో పాటు అరగంటలోనే పట్టాపాసుపుస్తకం అధికారులు అందివ్వనున్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేయడంపై రైతులందరూ సంతోషిస్తున్నారన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనం స్వాతి, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు పంజాల వెంకటేశ్‌గౌడ్ యాస రంగారెడ్డి, మాజీ సర్పంచులు చందర్‌గౌడ్, పూర్ణచందర్‌రాజు, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అరుణ, టీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధానకార్యదర్శి అనంతరెడ్డి, విద్యార్థి, యువజన, కార్మిక విభాగం మండల నాయకులు శేఖర్, మల్లికార్జున్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ