శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 28, 2020 , 00:22:27

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతు

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతు

గుండాల : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి గల్లంతు అయిన ఘటన మండలంలోని సుద్దాలలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూడ కిష్టమ్మ ఇటీవల మృతిచెందడంతో మంగళవారం పది దినాలు జరిగాయి. ఇందులో భాగంగా అదే గ్రామానికి గూడ సోమయ్య (60) తమ కులస్తులతో కలిసి స్నానాల కోసం గ్రామ చెరువు వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సోమయ్య నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే జనగామ రూరల్‌ సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సై చందర్‌, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

VIDEOS

logo