ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Oct 28, 2020 , 00:22:25

ప్రమాణస్వీకారానికి భారీగా తరలిరావాలి

ప్రమాణస్వీకారానికి భారీగా తరలిరావాలి

ఆలేరు : ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ గోధాంలో బుధవారం జరగనున్న ఆలేరు మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మండలంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలిరావాలని టీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్య, డైరెక్టర్‌ అయిలయ్య, నాయకులు కసావు శ్రీనివాస్‌, పాండవుల భాస్కర్‌గౌడ్‌, శారాజీ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo