శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 27, 2020 , 00:04:10

విజయానికి చిహ్నమే దసరా

విజయానికి చిహ్నమే దసరా

ఆలేరు: ఆలేరు నియోజకవర్గంతోపాటు యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా దసరాను ప్రజలు ఆనందోత్సవాల మధ్యన జరుపుకున్నారు. కొవిడ్‌ -19 నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.

ప్రభుత్వ విప్‌ దంపతులకు శుభాకాంక్షలు.. 

దసరా సందర్భంగా పలువురు నాయకులు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ హైదరాబాద్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ప్రభుత్వవిప్‌ దంపతులకు జమ్మిని అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బద్దూనాయక్‌, ఆలేరు పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కృష్ణంరాజు, నాయకులు పాల్గొన్నారు.

వినోద్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వవిప్‌

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనకు శ్రీలక్ష్మీనరసింహస్వామివారి లడ్డూను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆలేరు టౌన్‌లో...

ఆలేరు టౌన్‌ : ఆలేరు పట్టణంలో దసరాను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలేరులోని కనకదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్‌ బేతి రాములు, ఆలయ కమిటీ చైర్మన్‌ కొలుపుల హరినాథ్‌, సాయిబాబా గుడి కమిటీ చైర్మన్‌ వెనిశెట్టి సుధాకర్‌, బింగి రవి, కామిటికారి గోపి తదితరులు పాల్గొన్నారు.

ఆలేరురూరల్‌లో.. 

ఆలేరురూరల్‌ : దసరాను మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జమ్మి చెట్లకు పూజలు చేసి జమ్మిఆకుతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : గొంగిడి

మోటకొండూర్‌: దసరాను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, టెస్కాబ్‌ వైస్‌ చైర్మెన్‌, ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో టీఆర్‌ఎస్‌ మోటకొండూర్‌ మండల యువజన విభాగం మండల అధ్యక్షుడు బీస కృషంరాజు, అమ్మనబోలు సర్పంచ్‌ సిరిపురం నర్మద ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గొంగిడి దంపతులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు.  

గుండాలలో... 

గుండాల : మండలంలో విజయదశమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ చందర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాలలో ఎంపీపీ తాండ్ర అమరావతిశోభన్‌బాబు, జడ్పీటీసీ లక్ష్మి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఖలీల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ, సర్పంచులు బాషిరెడ్డి, సైదులు, వరలక్ష్మి, రాంరెడ్డి, డెన్నిస్‌రెడ్డి, మాధవి, రేఖ, భిక్షమమ్మ, విజితారెడ్డి, గాయత్రి, ఉపేంద్ర, హేమలత, బాలకృష్ణ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

తుర్కపల్లిలో... 

తుర్కపల్లి : దసరా వేడుకలను మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో గ్రామస్తులు రావణు చిత్రపటానికి దహనం చేశారు. అనంతరం ప్రజలు జమ్మి చెట్టు వద్ద జమ్మిని స్వీకరించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఆత్మకూరు(ఎం)లో.. 

ఆత్మకూరు(ఎం): మండలంలోని ప్రజలు దసరా ఘనంగా జరుపుకున్నారు. డప్పుచప్పుళ్లతో జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రాజాపేటలో...

రాజాపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే దుర్గామాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద  వాహన పూజలు చేశారు. సాయంత్రం ప్రజలంతా కలిసి జమ్మిచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.