శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 24, 2020 , 23:50:34

దుర్గామాతకు పూజలు

దుర్గామాతకు పూజలు

రాజాపేట : మండలంలోని రఘునాథపురం శివాలయంలో నెలకొల్పిన దుర్గామాత మంటపంలో శనివారం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వడిబియ్యం, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పల్లె సంతోశ్‌గౌడ్‌, కట్కం స్వామి, కీసరి రమేశ్‌ దంపతులు, వెంకటేశ్‌, కటకం నగేశ్‌, డొంకెన మహేందర్‌, కొండం రాజు, కనకరాజు, నర్సింహులు, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

గుండాలలో..

గుండాల : శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంతో పాటు తుర్కలశాపురం, పెద్దపడిశాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంటపాల్లో శనివారం అమ్మవారు బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. మండలకేంద్రంలో స్థానికులు రాసకచ్చుల గౌరిశేషాద్రి ఆధ్వర్యంలో బాలత్రిపుర సుందరి అమ్మవారి ముందు 9 మంది బాలికలకు కాళ్లు కడిగి నూతన వస్ర్తాలతో తూడిచి పసుపు కుంకుమలతో తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిందం ప్రకాశ్‌, బాలకృష్ణ, ఓడపల్లి మధు, రమేశ్‌, యాదగిరి, శ్రీకాంత్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఆలేరు రూరల్‌లో..

ఆలేరు రూరల్‌ : మండలంలోని కొలనుపాకలో దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవకమిటీ సభ్యులు మిట్టపల్లి పాండు, అబ్బగోని సుధాకర్‌, పార్వతీలింగమూర్తి, శేఖర్‌, నర్సింహులు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు