శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 24, 2020 , 23:50:34

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

ఆలేరు : నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.2లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 46 వీధి దీపాలను శనివారం స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే పల్లెలు ఆదర్శంగా మారాయన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి జలాలే లక్ష్యంగా ప్రభుత్వ విప్‌ ముందుకు సాగుతున్నారన్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందివ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

అనంతరం వీరతెలంగాణ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీనవరాత్రోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా వంగపల్లిలో భారీ బతుకమ్మలను తయారు చేసిన నలుగురు మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ కానుగు కవిత, ఉప సర్పంచ్‌ రేపాక స్వామి, ఎంపీటీసీ రేపాక మౌనిక, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ కల్లెపల్లి శ్రీశైలం, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కానుగు భిక్షంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎండీ అజ్జు, రేగు శ్రీను, వార్డు సభ్యులు పాల్గొన్నారు.