శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 24, 2020 , 23:50:34

రైతువేదిక నిర్మాణాలు వేగవంతం చేయాలి

రైతువేదిక నిర్మాణాలు వేగవంతం చేయాలి

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి అర్బన్‌: రైతులకు వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులు, వివిధ రకాల పంటలపై వ్యవసాయశాఖ ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో రైతువేదిక నిర్మాణాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో నిర్మిస్తున్న 92 రైతువేదికలలో పూర్తి అయిన వాటిని శనివారం ప్రారంభించేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న రైతువేదికలను అధికారులు, కాంట్రాక్టర్లు అలసత్వం వహించకుండా వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఈఈ జోగారెడ్డి, డీఈలు గిరిధర్‌, వెంకటేశ్వర్లు, బాలచందర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo