గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Oct 23, 2020 , 23:32:36

రైతువేదికలను పూర్తి చేయాలి

 రైతువేదికలను పూర్తి చేయాలి

భువనగిరి కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా క్లస్టర్‌ వారీగా రైతు వేదిక నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి, పల్లె ప్రకృతి వనాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలతో గూగుట్‌ మీట్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు మండల అభివృద్ధి అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. గ్రామాల వారీగా పల్లె ప్రకృతి వనాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.