శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 23, 2020 , 01:25:36

ఉమ్మడి జిల్లాలో రూ.120 కోట్ల పంట పెట్టుబడి రుణాలు

 ఉమ్మడి జిల్లాలో రూ.120 కోట్ల పంట పెట్టుబడి రుణాలు

నేరేడుచర్ల :  రైతుల కష్టాలు తొలిగిపోయి సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో మఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ చట్టంలో మార్పు తీసుకువచ్చారని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్‌ను గురువారం వారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని సహకార బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నారన్నారు. రైతుల ఇబ్భందులను తొలగించడానికి త్వరలో గరిడేపల్లిలో కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సాగు విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. 

డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని సీఎం కేసీఆర్‌ నాబార్డు నుంచి రూ. 1200కోట్లు రుణంగా తీసుకుని పంట పెట్టుబడి కోసం రైతులకు రుణాలు అందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ ఆధ్వర్యంలో రూ. 120 కోట్లు పంట పెట్టుబడికి రుణాలు అందించామన్నారు. నల్లగొండ జిల్లా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ. 7కోట్ల లాభాలతో ముందుకు పోతుందన్నారు. ఈ సమావేశంలో కో- ఆపరేటివ్‌ బ్యాంక్‌ సీఈవో మదన్‌మోహన్‌, డీజీఎం ఉపేందర్‌రావు, డీసీసీబీ డైరెక్టర్‌ అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు.