శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 22, 2020 , 00:06:43

పచ్చతోరణం

పచ్చతోరణం

  • గ్రామాల్లో పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
  • మండలంలోని 21 పల్లె ప్రకృతి వనాల్లో  నాటిన 33 వేల మొక్కలు 
  • ఆహ్లాదం.. ఆనందాన్ని కలిగిస్తున్న వనాలు

ఆత్మకూరు(ఎం): తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఆహ్లాదం, ఆరోగ్యంగా ఉండేందుకు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పట్టణాల్లోఉండే విధంగా పల్లెల్లో కూడా పచ్చనిపార్కులు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో  వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే చర్యలు చేపట్టారు. 

21 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు 

మండలంలోని 23 గ్రామ పంచాయతీలకుగాను 21 గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో 33వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామాలకు ఆనుకొని ఉన్న స్థలాలను గుర్తించి ప్రజల సౌకర్యం కోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు(ఎం)లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 2వేల మొక్కలు నాటగా కఫ్రాయిపల్లిలో 1500, కొరటికల్‌లో 1500, కూరెళ్లలో 2000, లింగరాజుపల్లిలో 1500, మోదుగుకుంటలో 1400, మోదగుబావిగూడెంలో 1800, మొరిపిరాలలో 1800, పల్లెపహడ్‌లో 2000, పారుపల్లిలో 1400, పుల్లాయిగూడెంలో 1500, రాఘవాపురంలో 2000, రహీంఖాన్‌పేటలో 1000, రాయిపల్లిలో 2000, సారగండ్లగూడెంలో 750, సర్వేపల్లిలో 1500, సింగారంలో 1000, టీ.రేపాకలో 2000, తిమ్మాపురంలో 1000, తుక్కాపురంలో 2000, ఉప్పలపహాడ్‌లో 500 మొక్కలు నాటారు.

ఆహ్లాదం కలిగిస్తాయి 

గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో మొ క్కలు నాటించాం. నాటిన మొక్కలు  పెరిగిన తర్వా త ప్రజలకు ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రకృతి వనా ల్లో వ్యాయామంతో పాటు కాలినడక కోసం దారులు ఏర్పాటు చేశాం. నాటిన ప్రతి మొ క్కను సంరక్షించే బాధ్యత అందరి పై ఉంది.

-తండమంగమ్మాశ్రీశైలంగౌడ్‌, ఎంపీపీ, ఆత్మకూరు(ఎం)

మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం 

గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో అన్ని రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉండే స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటించాం. రోజూ మొక్కలను సంరక్షించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి చేస్తున్నారు. 

-జన్నాయికోడె నగేశ్‌, సర్పంచ్‌, ఆత్మకూరు(ఎం)

ఎక్కువ మొక్కలు నాటించాం 

గ్రామాల్లో ఏర్పాటు చేసిన  ప్రకృతి వనాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటించాం. నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్లు, ఔషధ మొక్కలు కూడా నాటించాం. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా కృషి చేస్తున్నాం. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకుగాను పోతిరెడ్డిపల్లి, పల్లెర్ల గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేక  పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయలేదు.  మిగతా 21 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్కలు నాటించాం. పల్లె ప్రకృతి వనాలు ముందు తరాలకు ఉపయోగపడుతాయి.

-ఆవుల రాములు, ఎంపీడీవో, ఆత్మకూరు(ఎం)