సోమవారం 25 జనవరి 2021
Yadadri - Oct 21, 2020 , 01:57:35

క్షేత్రపాలకుడికి ఘనంగా ఆకుపూజ

 క్షేత్రపాలకుడికి ఘనంగా ఆకుపూజ

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంతన వెలసిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు ఆకుపూజ నిర్వహించారు. స్వామివారిని తమలపాకులతో అలంకరించి, శ్రీచందనంతో అభిషేకం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడలు, బెల్లం, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీస్వామివారిని పలువురు భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారికి నిత్యపూజలు

యాదాద్రి ఆలయంలో మంగళవారం నిత్యపూజలు కొనసాగాయి. బాలాలయంలో ఉత్సవమూర్తులను పంచామృతాలకు అభిషేకించి, పట్టువస్ర్తాలను ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజాము నే ఆలయాన్ని తెరచి ఆరాధన, సహస్త్ర నామార్చ న, సువర్ణ పుష్పార్చన వంటి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. 

బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం పర్వాలను అర్చకులు విశేషంగా జరిపారు. ఆలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను అర్చకులు కోలాహలంగా చేపట్టారు. సత్యనారాయణ  స్వామి వ్రతం లో భక్తులు పాల్గొని తరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీస్వామి అమ్మవార్లకు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

నేడు యాదాద్రికి నేతి, కేకే రాక

యాదాద్రి ఆలయానికి బుధవారం శాసన మండ లి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు, ఎంపీ కే. కేశవరావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత రానున్నారు. స్వామివారి దర్శన అనంతరం మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం లో జరిగే లక్ష్మీసుదర్శన చండీ హోమంలో పాల్గొంటారు.

ఖజానాకు రూ. 2,77,360 ఆదాయం

యాదాద్రి ఆలయ ఖజానాకు రూ. 2,77,360 సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధా న బుకింగ్‌తో రూ. 22,474, దర్శనాలతో రూ. 7,300, ప్రచారశాఖ ద్వారా రూ. 2,000, వ్రతాల తో రూ. 5,500, కల్యాణకట్టతో రూ. 10,460, ప్రసాద విక్రయాలతో రూ. 1,70,100, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,050, వాహన పూజల ద్వారా రూ. 5,400, అన్నదాన విరాళంతో రూ. 2,511, ఇత ర విభాగాలతో రూ. 50,565 లతో కలిపి మొత్తం 2,77,360 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.


logo