మన పథకాలు గుజరాత్‌లోనూ లేవు..

- ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ పరమావధి
- రాష్ట్రంలో సుమారు 50 సంక్షేమ పథకాలు
- వీటితో కోట్లాదిమంది లబ్ధి
- ఎన్నికలేవైనా సవాల్‌గా తీసుకొని పనిచేయండి
- ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ వేగిరం చేయాలి
- పార్టీ శ్రేణులకు మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపు
‘ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. మనలాంటి పథకాలు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేవు. చాలా రాష్ర్టాలు మన పథకాలను అమలు చేయాలని చూస్తున్నాయి. పథకాలతో కోట్లాది మంది లబ్ధిపొందు తున్నారు. ప్రతీ ఎన్నికను చాలెంజ్‌గా తీసుకోవాలి. పట్టభద్రుల ఎన్నికను సవాల్‌గా తీసుకొని పనిచేయండి. ప్రభుత్వ పథకాలను, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయండి. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి’ అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి చౌటుప్పల్ మండలం దామెరలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టభద్రుల ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ సమీక్ష సమా వేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రవీందర్రావు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దామెర గ్రామంలో శ్రీబాలాజీ ఫంక్షన్హాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన పట్టభద్రుల ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమా రు 50 రకాల సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నేరవేర్చడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. యావత్ దేశం తెలంగాణ సంక్షేమ పథకాల వైవు చూస్తోందన్నారు. అంతేకాకుండా ఏ ఎన్నికైనా కార్యకర్తలు సవాల్‌గా తీసుకుని పనిచేయాలన్నా రు. ప్రజలకు పార్టీ మీద ప్రేమ, మంచి వాతవరణం ఉన్నా ఓటు వేయిచుకోకుంటే ఫలితం శూన్యమన్నారు. ఓటును మలుచుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎన్నికల ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు గీటు రాయన్నారు. సర్పంచ్‌లు, కౌన్సిలర్లు బాధ్యతగా తీసుకోని ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ గెలువాల్సిందేనన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడగాలన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. రాష్ట్రంలో పోలీసు, టీచర్లు, ఏఈవోలు, సింగరేణిలో, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతి సెక్రటరీలు కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో కలిపి 1.50 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించిందన్నారు. 5 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. ఐటీ సంస్థలను కూడా అభివృద్ధి చేసి 2 లక్షల మందికి ఉపాధి కల్పించదన్నారు.ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు సన్నద్ధులై ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరించి ప్రజలను ఓట్లు ఆడగాలన్నా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవీందర్రావు, స్థానిక ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డిరాజు, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షు డు గిర్కటి నిరంజన్‌గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షు డు ఊడుగు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాటలు పాడే వేణువు సిద్ధం చేసిన గిరిజనుడు.. వీడియో
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన : మంత్రి కేటీఆర్
- బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
- డ్రగ్ సిండికేట్‌కు చెక్ : రూ 4 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్!
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం