శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 20, 2020 , 05:30:45

సొంత డబ్బుతో రాసకాల్వ పూడికతీత

సొంత డబ్బుతో రాసకాల్వ పూడికతీత

మోత్కూరు : మండలంలోని జటంగిబావి గ్రామంలో రాసకాల్వలో మట్టి, చెత్త, ముళ్ల కంప తొలగింపు పనులను ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సోమవారం గ్రామంలో జరుగుతున్న పనులను సందర్శించారు. కొండగడప గ్రామం పెద్దచెరువు నుంచి పాటిమట్ల వరకు ఉన్న రాసకాల్వలో పూడిక మట్టి, ముళ్లచెట్లు, చెత్త బాగా పెరిగాయన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి మోత్కూరులోని పెద్దచెరువు, ఇంగీసమ్మ కుంట, కొండగడపలోని జంట చెరువులు నిండాయి. దిగువన ఉన్న పాటిమట్ల, సదర్శాపురం గ్రామాల్లోని చెరువులకు సాగు నీటి కల్పన కోసం తవ్విన రాసకాలువ సుమారు 15 ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో వరద నీరు వృథాగా పోతున్నది. రైతుల కోరిక మేరకు మండల జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, దాచారం- పాటిమట్ల గ్రామాల ఎంపీటీసీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి వారి సొంత ఖర్చులతో జేసీబీతో పనులను నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా పనులు చేయించడంతో ఆయా గ్రామాల సర్పంచ్‌లు దండెబోయిన మల్లేశ్‌, వర్రె కవితాశ్రీను రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యాక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్ష, కార్యదర్శులు పొన్నెబోయిన రమేశ్‌, గజ్జి మల్లేశ్‌, రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ కొండ సోంమల్లు, సదర్శాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు దొండ నర్సయ్య, రైతులు భాస్కర్‌, మల్లేశ్‌, చంద్రయ్య, అయిలయ్య, శ్రీను పాల్గొన్నారు.