సోమవారం 08 మార్చి 2021
Yadadri - Oct 18, 2020 , 00:51:09

రైతువేదికల నిర్మాణ పనులు పరిశీలన

రైతువేదికల నిర్మాణ పనులు పరిశీలన

తుర్కపల్లి : రైతువేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను శనివారం పరిశీలించి మాట్లాడారు. రైతువేదికల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. దానికనుగుణంగా నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ దసరా లోపు పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో దుర్గేశ్వరి, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ యాకూబ్‌ తదితరులు ఉన్నారు.

రైతు వేదికలు దసరాకు ప్రారంభం చేయాలి..

గుండాల : రైతువేదికలను దసరాకు ప్రారంభించేలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వెల్మజాల, సీతారాంపురం, బ్రాహ్మణపల్లి, గుండాల, పెద్దపడిశాల, వస్తాకొండూర్‌ గ్రామాల్లో నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నత్తనడకన సాగుతున్న గ్రామాల్లో కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ జోగారెడ్డి, పీఆర్‌ డీఈ నరేందర్‌రెడ్డి, ఈజీఎస్‌ ఈసీ వినోద్‌కుమార్‌, సర్పంచులు బాలకృష్ణ, మాధవీమాధవరెడ్డి, వరలక్ష్మీప్రకాశ్‌, పిట్టల హేమలతాపూర్ణచందు, మల్లేశం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రైతువేదిక నిర్మాణ పనులు పరిశీలన..

ఆత్మకూరు(ఎం) : రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను శనివారం సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌, ఏఈవో రాజశేఖర్‌గౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగలోపు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

VIDEOS

logo