బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 17, 2020 , 00:14:08

నేటి నుంచి దసరా శరన్నవరాతోత్సవాలు

నేటి నుంచి దసరా శరన్నవరాతోత్సవాలు

ముస్తాబైన శివబాలాలయం

రోజో అలంకారంలో అమ్మవారు

ఆలేరు: శ్రీ దేవీ శరన్నవరాతోత్సవాలకు జిల్లాలోని ఆయా గామాల్లో మండపాలు సిద్ధమయ్యా యి. పతి ఏటా ఆశ్వయుజ పాఢ్యమి మొదలు నిజ శుద్ధ ఆశ్వీయుజ శుద్ధ నవమి(దశమి) వరకు దసరా శరన్నవరాతోత్సవాలు భవంగా నిర్వహిస్తారు. శనివారం నుంచి 9 రోజుల పాటు నిర్వహించే దేవీ  శరన్నవరాతోత్సవాలను భవంగా నిర్వహించేందుకు మండపాలను ముస్తాబు చేశారు. రంగురంగుల దీపాలతో తీర్చిదిద్దారు.

శరన్నవరాతి మహోత్సవాల్లో మొదటిరోజైన ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దేదీప్యమానంగా పకాశించే అమ్మవారి దర్శనంతో సకల దారిద్యాలు నశిస్తాయి. తొలిరోజు పాఢ్యమిన బెల్లపు అన్నం, విధియ రోజున పులిహోర, తదియ రోజున కొబ్బరి అన్నం, చవితి రోజున అల్లపు మినపగారెలు, పంచమి రోజున పెరుగు అన్నం, షష్ఠి రోజున కేసరి హల్వా, సప్తమి రోజున కూరగాయలతో అన్నవం వాంగీబాత్‌, అష్టమి రోజున మినపగారెలు, హల్వా, నవ మి రోజున పాయసాన్నం, విజయదశమిరోజున చితాన్నము, లడ్డూలను నైవేద్యంగా పెడతారు. 

ముస్తాబైన శివబాలాలయం..

స్వయంభూ వెలసిన యాదాది లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేతంలోని అనుబంధ ఆలయమైన బాలశివాలయం దసరా శరన్నవరాతోత్సవాలకు ముస్తాబయింది. అమ్మవారికి మండపాన్ని సిద్ధం చేశారు. కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలతో శివాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. 9 రోజులు జరిపే నవరాతి ఉత్సవాలలో దంపతులు పాల్గొనే విధంగా వసతులు కల్పించారు. ఉత్సవాలలో పాల్గొనే వారు రూ. 1,116, సప్తశతి పారాయణం చేయుటకు రూ. 116, లక్ష కుంకుమార్చన రూ. 116  రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు కొవిడ్‌ -19 నిబంధనలు పకారం భౌతికదూరం పాటించి పూజల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. 

అమ్మవారికి రోజుకో అలంకారం..

దేవీ శరన్నవరాతుల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీదుర్గాదేవిని మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో పత్యేక పూజలు చేపడతారు. ఈ రోజున తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశస్థాపనలో, పంచగవ్య పాశనం, రుతిక్వరుణంతో నవరాతులకు శ్రీకారం చుడతారు. రెండోరోజు బాలతిపుర సుందరిగా అలంకరిస్తారు. మూడోరోజు గాయతీదేవి, నాలుగవరోజు అన్నపూర్ణాదేవి, ఐదోరోజు లలితా తిపుర సుందరిదేవి, ఆరోరోజు మహాలక్ష్మీ, ఏడవరోజు సరస్వతీదేవి(మూలనక్షతం), ఎనిమి దవ రోజు దుర్గాదేవి(దుర్గాష్టమి), తొమ్మిదవరోజు మషిషాసుర మర్థిని(మహార్నవమి), పదోరోజు దసరాను పురస్కరించుకొని రాజరాజేశ్వరీ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

విజయదశమితో ముగింపు..

శమి శమీయతే పాపం.. శమి శతు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి రామస్య పియ దర్శనం అని శమీ వృక్షానికి పూజలు  చేయడం అనవాయితీ. పాపాలను శమింపజేసి..శతువు వినాశనం గావించేది శమీ వృక్షం. అర్జునుడు మారువేశం(పేడి) వదిలి ఈ వృక్షానికి పూజలు నిర్వహించి తిరిగి గాండీవాన్ని  చేపట్టాడని, రాముడు రావణుడిని సంహరించి శమీ వృక్షానికి పూజ చేసి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అందుకే వృక్షం అత్యంత పవితమైందని, శమీపూజ విజయానికి సంకేతమని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇలా విజయదశమితో నవరాతులు కోలాహలంగా ముగుస్తాయి. 


VIDEOS

logo