శనివారం 06 మార్చి 2021
Yadadri - Oct 17, 2020 , 00:14:05

బిక్కు బిక్కుమంటూ బిక్కేరు వాగు దాటి...

బిక్కు బిక్కుమంటూ బిక్కేరు వాగు దాటి...

పసిబాలుడికి తృటిలో తప్పిన పమాదం 

ఆత్మకూరు(ఎం) : పాథమిక ఆరోగ్య కేందానికి పసిబాలుడికి ద్య పరీక్షలు చేయించేందుకు బిక్కేరు వాగు నుంచి బైక్‌ దాటుతుండగా నీటి పవాహానికి బైకు నీటిలో ఒక దిక్కు ఒరిగిపోయింది. దీంతో 2 నెలల పసి బాలుడికి తృటిలో పమాదం తప్పింది. ఈ ఘటన శుకవారం ఆత్మకూరు(ఎం) మండలంలో జరిగింది.

మండలంలోని మోదుగుకుంట గామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు కూతురు మానసకు 2 నెలల కితం కొడుకు పుట్టాడు. బాలుడికి ద్య పరీక్షలతో పాటు నెల సూదిని వేయించేందుకు తండి బైకు మండల కేందంలోని పాథమిక ఆరోగ్య కేందానికి బయలుదేరారు. మార్గమధ్యలో మొరిపిరాల-ఆత్మకూరు(ఎం) గామాల మధ్యన బిక్కేరు వాగును దాటుతుండగా  నీటి పవాహానికి బైకు ఒక దిక్కు ఒరిగింది. పసిబాలుడిని ఎత్తుకొని వెనుక కూర్చున్న మానస కిందికి దూకింది. అదే మార్గంలో వాగు దాటుతున్న యువకులు వెంటనే నీళ్లలో పడబోతున్న బాలుడిని పట్టుకున్నారు. పసివాడికి పెద్ద పమాదం తప్పడంతో బాలుడి తల్లి, తాత, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

VIDEOS

logo