బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 16, 2020 , 02:16:03

కలెక్టర్‌ కారును ఢీకొట్టిన లారీ

కలెక్టర్‌ కారును ఢీకొట్టిన లారీ

  • తృటిలో తప్పిన ప్రమాదం 
  • కలెక్టర్‌కు ఫోన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ

భువనగిరి : పంటనష్టం పరిశీలనకు వెళ్లి వస్తున్న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కారును అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అనాజీపురం గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. 

పంటనష్టం పరిశీలనకు వెళ్లిన కలెక్టర్‌ వలిగొండ మండలం నుంచి భువనగిరికి వస్తున్నారు. మార్గమధ్యలో అనాజీపురం-నందనం గ్రామాల సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన బాలేకవారి శేఖర్‌ లారీతో భువనగిరి నుంచి చిట్యాల వైపునకు వెళ్తూ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న కలెక్టర్‌ కారును ఢీకొట్టింది. కలెక్టర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.  ప్రమా ద విషయాన్ని తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను తీసుకువెళ్లారు. రూర ల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

కలెక్టర్‌కు మంత్రి పరామర్శ

కలెక్టర్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు ఫోన్‌ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ అమరేందర్‌గౌడ్‌, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనీల్‌కుమార్‌ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు గోమారి సుధాకర్‌రెడ్డి తదితరులు కలెక్టర్‌ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

VIDEOS

logo