చెరువులు నిండడం సంతోషం

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ : ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండుకోవడం సంతోషదాయకమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం చెరువును కౌన్సిలర్ కొయ్యడ సైదులుగౌడ్, సందగళ్ల విజయ, కాసర్ల మంజులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అదేవిధంగా చిన్నకొండూరు రోడ్డులో నిల్చిన వరద నీటిని పరిశీలించారు. ఆయన వెంట నాయకులు సతీశ్‌గౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సాయిలు, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పర్యటన
చౌటుప్పల్ రూరల్ : మండల పరిధిలోని చిన్నకొండూర్, నేలపట్ల గ్రామాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పర్యటించారు. ఆ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు చౌట వేణుగోపాల్‌గౌడ్, బక్క స్వప్న ఉన్నారు. ఎల్లగిరిలో దెబ్బతిన్న పంట పొలాలను సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి పరిశీలించారు. సంస్థాన్ నారాయణపురంలో...
సంస్థాన్‌నారాయణపురం: వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిల్లపురం, గంగముల తండా, డాకుతండా, వాచ్యతండా, పల్లగట్టు తండా, నారాయణపురం గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.
అనంతరం చెరువులకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఏపూరి సతీశ్, మందుగు బాలకృష్ణ, వాంకుడోతు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు