600 మంది టీఆర్ఎస్లో చేరిక

ఆలేరు: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమపథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తుర్కపల్లి మండలం వెంకటాపురం సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు మొత్తం 600 మంది కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి యాదగిరిగుట్టలో బుధవారం ప్రభుత్వ విప్, డీసీసీబీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీకండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ సాగునీటిపై దృష్టిసారించార న్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ. 120 కోట్ల పంటరుణాలు అందజేశామన్నారు. డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, తుర్కపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, ఎంపీపీ సుశీల, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బద్దూ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి. నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ నర్సింహులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ రవీందర్‌గౌడ్, నాయకులు వెంకటయ్య, హేమేందర్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆస్తుల వివరాలు నమోదు చేయించుకున్న గొంగిడి దంపతులు
వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ప్రభుత్వ విప్ ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డికి, యాదగిరిగుట్టలో డీసీసీబీ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు తమ వ్యవసాయేత ఆస్తుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఆస్తుల నమోదు ప్రక్రియను శ్రీకారం చుట్టిందన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
బతుకమ్మ చీరెల పంపిణీ
యాదగిరిగుట్టలోని పలు వార్డుల్లో టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి బతుకమ్మ చీరెలు అందజేశారు. వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమతాసాయి, బూడిద సురేందర్, గుండ్లపల్లి వాణి, కో ఆప్షన్ సభ్యురాలు గోర్ల పద్మ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, పాపట్ల నరహరి పాల్గొన్నారు.