ఆస్తుల మదింపు ఆన్లైన్లో భద్రం

మనకో ఇంటి స్థలం ఉంది. దీనికి ఆధారం సబ్‌రిజిస్ట్రార్ ఆమోదించిన డాక్యుమెంట్ మాత్రమే. దీనికి సంబంధించి లింకు కాగితాలు ఉంటే ఆస్తి మనదని భరోసా ఉంటుంది. మనకు తెల్వకుండానే కొంత స్థలం కబ్జాయితే.. తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం నాదంటే.. ఇరువర్గాల మధ్య గొడవలు, పంచాయితీలు. చివరకు కోర్టులవరకెళ్లడంతో తీవ్ర మనోవేదనకు గురవుతాం.
ఇలాంటి వివాదాలన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో ప్రతీ ఇంచు భూమిని నమోదు చేస్తారు. దీనికి సంబంధించి వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించే ప్రక్రియ జిల్లావ్యాప్తంగా శరవేగంగా సాగుతోంది. అధికారులు, సిబ్బంది ప్రతీ ఇంటికెళ్లి జాగతోపాటు ఇంటిని కొలుస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు తీసుకోకుండా ఇంటి యజమాని నుంచి వివరాలు తీసుకుంటున్నారు. వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్ చేయడం వల్ల ఆస్తులకు పక్కా రక్షణ ఉండడంతోపాటు భవిష్యత్తులో కబ్జాలు, సరిహద్దు వివాదాలకు ఆస్కారం ఉండదు. జిల్లాలో ఆరు పురపాలక సంఘాలుండగా, వీటి పరిధిలో 43,396 వ్యవసాయేతర ఆస్తులున్నట్లు గుర్తించారు. వారంరోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదికిచ్చేందుకు యంత్రాంగమంతా తలమునకలైంది.- భువనగిరి అర్బన్
భువనగిరి అర్బన్: ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను రక్షించడానికి చర్యలు చేపట్టింది. జిల్లా యంత్రాంగం ఇంటింటి సర్వేను ముమ్మరం చేసింది. ‘ధరణి’ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే ఆస్తులు భద్రంగా ఉంటాయని ప్రత్యేకంగా ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చటానికి సంబంధిత అధికారులు ఇప్పటికే ఇంటింటి సర్వే చేస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా ధరణి పోర్టల్ ద్వారా ఆస్తుల క్రయవిక్రయాలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
‘ధరణి’ పోర్టల్ ద్వారా ఉపయోగం....
ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో ఆస్తులు పొందుపర్చితే అక్రమంగా ఒకరి నుంచి మరొకరి పేరు మీదకు మారవు. ఒకవేళ ఆ యజమాని బదిలీ చేయాలన్నా పోర్టల్ ద్వారానే మార్పు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు, ఫామ్‌హౌస్‌లు, బడి, గుడి, దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, దాబాలు, హోటళ్లు, మసీదులు, చర్చీలు, వైకుంఠధామం, వాటర్ ట్యాంకులు, వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లో పొందుపర్చేందుకు సర్వే చేస్తున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో అన్ని వార్డులను నమోదు కాని కట్టడాలను ఆన్లైన్లోఎంట్రీ చేస్తున్నారు.
ఆన్లైన్ చేయడానికి ఆధారాలు..
‘ధరణి’ వెబ్సైట్లో ఆస్తులను ఆన్లైన్ చేయటానికి సంబంధిత ఆధారాలు ఇంటి యజమాని సర్వే చేస్తున్న సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వ్యవసాయేతర ఆస్తులను పొందుపర్చేందుకు గ్రామ పంచాయతీ, మున్సిపల్లో నివాసం ఉంటున్న వారు ఇంటి నంబర్, ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, నీటిపన్ను రసీదు, ఇంటి యజమాని ఫొటో, ఇంటి యజమాని గుర్తింపుకార్డు, రిజిస్ట్రేషన్ పత్రాలు, వ్యవసాయ బావుల వద్ద నిర్మించుకున్న ఇండ్లకు సర్వే నంబర్‌తోపాటు ఆ ఇండ్లకు నంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పట్టాపుస్తకం వివరాలు, రేషన్‌కార్డు, జన్‌ధన్ ఖాతా నంబర్, జాబ్‌కార్డు వివరాలు, ఆసరా పింఛన్ వివరాలు, ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు వివరాలు, ఇంటి యజమాని ఫోన్ నంబర్ తదితర వివరాలను సర్వే చేస్తున్న సిబ్బందికి అందజేస్తే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు పొందుపర్చుతారు. ఒకసారి ఆన్లైన్లో ఎంట్రీ పూరైన తర్వాత అన్ని కట్టడాల కొలతలు మరోసారి సరిచూసుకుంటారు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసి ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు వస్తే వాటిని సరి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు.
మున్సిపాలిటీల్లో వ్యవసాయేతర ఆస్తులు...
ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లా లో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సి పాలిటీల్లోని ఆస్తుల వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చటానికి ఇప్పటికే సర్వేను ముమ్మరం చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 43,396 ఇండ్లు ఉన్నాయి.
సర్వేను వేగవంతం చేశాం
ఇంటింటి సర్వేను ముమ్మరం చేశాం. పట్టణంలో 4383 గృహాలు ఉన్నా యి. 30శాతం మేరకు ఇండ్ల పూర్తి వివరాలను సర్వే ద్వారా నమోదు చేశాం. సర్వేలో అంగన్వాడీ టీచర్లు, వీఆర్వోల సహాయం తీసుకుంటున్నాం. ప్రజలు తమ ఆస్తుల నమోదుకు సహకరిస్తున్నారు. అధికారులు ఇచ్చిన సమయంలో అన్ని వివరాలు సేకరించి ధరణి పోర్టల్‌లో నమోదుచేస్తాం. - జంపాల రజిత, యాదగిరిగుట్ట, మున్సిపల్ కమిషనర్
నమోదుకు సహకరించాలి
ఆన్లైన్ చేయడం సంతోషం
తాజావార్తలు
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం
- ‘అనంత’ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
- శర్వానంద్ నాకు బిడ్డలాంటి వాడు: చిరంజీవి