గురువారం 04 మార్చి 2021
Yadadri - Oct 05, 2020 , 01:17:32

అభివృద్ది చేసినందుకే మంత్రి కేటీఆర్‌ను అభినందించా

అభివృద్ది చేసినందుకే మంత్రి కేటీఆర్‌ను అభినందించా

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌: ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేసినందుకే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను అభినందించానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దండుమల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ పార్కు వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు. అందుకే పార్కు ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అభినందించానన్నారు.  పార్టీలను చూడొద్దని, అభివృద్ధి చేస్తున్న వారిని ప్రోత్సహిస్తే తప్పేమి లేదన్నారు. ఈప్రాంత సమస్యలను మున్సిపల్‌శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, త్వరలో ఇక్కడ పర్యటిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు.  ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు బస్వాపూర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు.   లిఫ్ట్‌ ఏర్పాటు చేసి ఈప్రాజెక్టులోని జలాలతో గొలుసుకట్టు చెరువులు నింపాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు  వెంకటయ్య,  సైదులుగౌడ్‌,  సతీశ్‌, సాయిలు, రమేశ్‌గౌడ్‌  పాల్గొన్నారు.  

వరద కాల్వ పనుల పరిశీలన... 

చౌటుప్పల్‌ రూరల్‌: మండలపరిధిలోని దండుమల్కాపురం టీఎస్‌ఐఐసీ పార్కు మీదుగా లక్కారం చెరువులోకి వచ్చే వరద కాల్వను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వ మరమ్మతులు చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ  ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య,  గ్రామ సర్పంచ్‌ ఎలువర్తి యాదగిరి, కొయ్యడ సైదులుగౌడ్‌, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల ఇంద్రసేనారెడ్డి  పాల్గొన్నారు. 


VIDEOS

logo