సోమవారం 01 మార్చి 2021
Yadadri - Oct 03, 2020 , 04:47:14

వ్యవసాయేతర ఆస్తులను నమోదుచేయాలి

వ్యవసాయేతర ఆస్తులను నమోదుచేయాలి

జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి

భువనగిరి: వ్యవసాయేతర ఆస్తులను పక్కాగా నమోదు చేయాలని  జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రామచంద్రాపురం, పెంచికల్‌పహాడ్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూములను పక్కాగా నమోదు చేయాలనే సంకల్పంతో ముందుకుసాగుతుందన్నారు. గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు భువనగిరి శ్రీనివాస్‌, సిలువేరు పుష్ప, పంచాయతీ కార్యదర్శులు, గ్రామసిబ్బంది  పాల్గొన్నారు

ప్రజల హితం కోసమే ధరణి పోర్టల్‌ ఇంటింటి సర్వే 

వలిగొండ:  ప్రభుత్వం ప్రజల హితం కోసమే ధరణి పోర్టల్‌ ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సుంకిశాలలో పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో గీతారెడ్డి, తహసీల్దార్‌ నాగలక్ష్మి, సర్పంచ్‌ మొగిలిపాక నర్సింహ, ఏపీవో అరుణకుమారి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం పాల్గొన్నారు.VIDEOS

logo