మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Oct 02, 2020 , 00:57:05

పట్టభద్రుల ఓట్ల నమోదు

పట్టభద్రుల ఓట్ల నమోదు

ఆలేరు : అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు చేసి, నమోదు పత్రాలను డిప్యూటీ తహసీల్దార్‌ నర్సింహారావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు కీలకంగా మారనున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ మిట్ట వెంకటయ్య, సర్పంచ్‌ బైరగాని చిన్నపుల్లయ్యగౌడ్‌, నాయకులు కీసరి బాలరాజుగౌడ్‌, బండ రామస్వామి, ఉప్పలయ్య, రాజేశ్‌, విద్యార్థి నాయకులు మిట్ట అరుణ్‌, గోపగాని ప్రసాద్‌, ఎండీ అజ్జు పాల్గొన్నారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి..

తుర్కపల్లి : పట్టభద్రులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంతో పాటు రుస్తాపూర్‌, వీరారెడ్డిపల్లి, దత్తాయిపల్లి, వెల్పుపల్లి తదితర గ్రామాల్లో పట్టభద్రులకు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఇద్రిస్‌ వద్ద జడ్పీవైస్‌ చైర్మన్‌ బీకునాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌ ఓటు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నరసింహారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ కొమిరిశట్టి నర్సింహులు, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్వీ, యువజన విభాగం మండలాధ్యక్షుడు భాస్కర్‌యాదవ్‌, శంకర్‌నాయక్‌, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్‌, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య, జక్కుల శ్రీవాని వెంకటేశ్‌, నాయకులు విజయ్‌, ఐలయ్య, వెంకటేశ్‌, లచ్చయ్య, గురువయ్య ఉన్నారు.

ఓటు నమోదు దరఖాస్తు ఫారాలు అందజేత..

రాజాపేట : పట్టభద్రుల ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ శివగణేశ్‌కుమార్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులు తప్పక ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి గుంటి కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల సెక్రటరీ జనరల్‌ సందిల భాస్కర్‌గౌడ్‌, యువజన మండల ప్రధానకార్యదర్శి పల్లె సంతోశ్‌గౌడ్‌, సర్పంచులు ఠాకూర్‌ ధర్మేందర్‌సింగ్‌, రామిండ్ల నరేందర్‌, ఎర్రగోకుల రాజు, మన్నె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల నుంచి దరఖాస్తుల స్వీకరణ..

ఆలేరు టౌన్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు కోసం పట్టభద్రుల నుంచి తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తై ఈ ఏడాది నవంబర్‌ 1వ తేదీ వరకు మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నదన్నారు. దరఖాస్తులకు గడువు నవంబర్‌ 6, ముసాయిదా ఓటరు జాబితా డిసెంబర్‌ 1, అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఉన్నదన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 18న ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య పాల్గొన్నారు.

మోటకొండూరులో..

మోటకొండూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్తి గెలుపునకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ సత్యనారాయణకు ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.

పట్టభద్రుల ఓటు నమోదు..

ఆత్మకూరు(ఎం) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కో సం టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి తన ఓటు నమోదు పత్రాన్ని తహసీల్దార్‌ పి.జ్యోతికి అందజేశారు. అదేవిధంగా మండలంలోని రాఘవాపురం లో పట్టభద్రులైన అభ్యుర్థులకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తొలుపునూరి శ్రీకాంత్‌గౌడ్‌ ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాఘవాపురం సర్పంచ్‌ దొండ కమలమ్మ, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పురుషోత్తంరెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు నాగరాజు, నియోజకవర్గం ప్రధానకార్యదర్శులు మహేశ్‌, మల్లికార్జున్‌, రాజు, మహేశ్‌, సతీశ్‌, అరుణ్‌, స్వామి, నరేశ్‌ పాల్గొన్నారు.

బొమ్మలరామారంలో.. 

బొమ్మలరామారం : మండలంలోని పట్టభద్రులు ఎమ్మె ల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎం పీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదె బాల్‌నర్స య్య అన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు దరఖాస్తు పత్రాలను తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అ సిస్టెంట్‌ సునీల్‌కు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గణేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు శశిధర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీధర్‌, సర్పంచులు మంజుల, అరుణ, నవీన్‌గౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ భరత్‌, పాండు తదితరులు ఉన్నారు.

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..

గుండాల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథగుప్తా అన్నారు. తుర్కలశాపురంలో పట్టభద్రులకు దరఖాస్తు ఫారాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జక్కుల భిక్షమయ్య, రైతుబంధు గ్రామ కన్వీనర్‌ పురుగుల మత్స్యగిరి, నాయకులు నర్సయ్య, మత్స్యగిరి, యూత్‌ నాయకుడు మధు, జాగృతి మండల కన్వీనర్‌ అనీల్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo