బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 02, 2020 , 00:58:21

గంగమ్మకు పుష్పాభిషేకం

గంగమ్మకు పుష్పాభిషేకం

భువనగిరి అర్బన్‌: భువనగిరి పెద్దచెరువు నిండటంతో పట్టణ రైతన్నలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి పెద్దచెరువు అలుగు పోయడంతో ఎమ్మెల్యే నీటిలో కుంకుమ, పసుపు వదిలి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 13 ఏండ్ల నుంచి చెరువు నిండలేదని,  చెరువు నిండటంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అలుగు నీరు కింద భాగంలో ఉన్న చెరువుల్లోకి చేరడంతో భువనగిరి పరిధిలో ఆయకట్టు శాతం పెరుగుతుందన్నారు. రైతులకు చేతినిండా పనులుంటాయని, మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని సంతోషంగా సంబురాలు చేసుకుంటున్నారన్నారు. అలుగుకాల్వను పరిశీలించి అలుగు నీరు వృథా కాకుండా కాల్వ మర్మమతులు చేపట్టాలన్నారు. కాల్వ ద్వారా కిందున్న చెరువుల్లోకి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవి యాదవ్‌, మండల అధ్యక్షుడు జనగాం పాండు, కౌన్సిలర్లు ఏవీ కిరణ్‌కుమార్‌, అందె శంకర్‌, దిడ్డికాడి భగత్‌, వెంకటనర్సింగ్‌ నాయక్‌, జిట్ట వేణుగోపాల్‌రెడ్డి, చెన్న స్వాతిమహేశ్‌, కోఆప్షన్‌ సభ్యులు రాచమల్ల రమేశ్‌, సబితాగోపాల్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo