శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Sep 30, 2020 , 00:25:48

ప్రతి సామాన్యుడికి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం

ప్రతి సామాన్యుడికి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం

  •    జిల్లా దవాఖానలో మెరుగైన సేవలు                
  •    నిరంతరం అందుబాటులో వైద్యులు.. 
  •    దవాఖాన అభివృద్ధికి సర్కారు చర్యలు          
  •     జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి 
  •    కలెక్టర్‌తో కలిసి దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం 

భువనగిరి : సామాన్యుడికి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు చిత్తశుద్ధితో ఉందని   జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లా దవాఖానలో వైద్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిరంంతర పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు వైద్యం అందించాలన్నారు. ప్రతి చిన్న విషయాలకి సమీపంలోని హైదరాబాదుకు తరలించకుండా రోగులకు ఇబ్బందులను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం దవాఖానా బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతుందని  ప్రభుత్వ సూచనల మేరకు వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. 

రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలన్నారు. దవాఖానలో సిబ్బంది, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దవాఖానా అభివృద్ధి కమిటీ సమావేశాలకు తగు సమాచారంతో అధికారులు హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖానా అభివృద్ధి కమిటీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, శ్రీరాముల జ్యోతి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.