గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Sep 30, 2020 , 00:00:10

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గెలుపు ఖాయం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గెలుపు ఖాయం

  • టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శక్తివంచన లేకుండా పని చేయాలి 
  • అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి 
  • డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి 
  • గ్రామ ఇన్‌చార్జిలకు ఓటు నమోదు దరఖాస్తులు పంపిణీ 

గుండాల : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గెలుపే ఖాయంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల గ్రామ ఇన్‌చార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు నమోదుకు అన్ని గ్రామాల ఇన్‌చార్జీలు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారన్నారు. అనంతరం గ్రామ ఇన్‌చార్జీలకు ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు ఫారం-18ను అందజేశారు. 

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం..

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని రామారం గ్రామానికి చెందిన బంగారోజు రాజుకు రూ.35 వేలు, గుండాలకు చెందిన మేకల కొమురయ్యకు రూ.41వేలు, బ్రాహ్మణపల్లికి చెందిన జల్లి వెంకటేశ్‌కు రూ.40వేలు, తుర్కలశాపూరం గ్రామానికి చెందిన పురుగుల సత్తయ్యలకు రూ.40వేల చొప్పున మొత్తం రూ.లక్షా 56వేల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం సహాయనిధి చెక్కులు అందేలా కృషి చేస్తున్నారన్నారు.

సహకార సంఘాల బలోపేతమే ప్రభుత్వ ధ్యేయం..

సహకార సంఘాల బలోపేతమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గుండాల  మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుండాల మండలం పూర్తిగా వెనుకబడిన మండలం అనే ఉద్దేశ్యంతో ఇక్కడి ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే పెద్ద మొత్తంలో పంటరుణాలు అందజేశామన్నారు. ఉమ్మడి నల్లగొండ పరిధిలో ఉన్న 107 సహకార సంఘాల్లో ఎక్కడాలేని విధంగా కేవలం గుండాల ప్రాంతానికే రూ.4కోట్ల 55లక్షల పంట రుణాలు ఇచ్చామన్నారు. రైతులు పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే సీఎ కేసీఆర్‌ పంట రుణాలు ఇచ్చేందుకు కృషిచేస్తూ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు. గుండాల మండలానికి గోదావరి జలాలు రావడం సంతోషంగా చాలా ఉన్నదన్నారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఏవిధంగా మేలు చేయాలనే భావనతో సీఎం కేసీఆర్‌ సహకార సంఘాల ద్వారా పంట రుణాలు ఇస్తున్నారన్నారు. 

అంతేకాకుండా రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అందిస్తూ అండగా నిలుస్తున్నారాన్నారు. ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల లోతు, కట్టలు పోయడం, అలుగు నిర్మాణం, తూములను అభివృద్ధి చేయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి దృఢంగా ఉన్నాయన్నారు. పత్తి జిన్నింగ్‌ మిల్లు, గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో సహకార సంఘాలను బహుళార్ధ సహకార సంఘాలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. మున్ముందు వరినాట్ల మిషన్లను సంఘాలకు ఇచ్చే ఆలోచన చేస్తునట్లు చెప్పారు. అనంతరం మరో రూ.20లక్షల పంట రుణాలు మంజూరు చేయడంతో పాలకవర్గం డీసీసీబీ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల భిక్షం, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ పురుగుల యాదలక్ష్మి, రైతుబంధు మండల కన్వీనర్‌ పాండరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇమ్మడి ధశరథ, మాజీ జడ్పీటీసీ కోలుకొండ యాదగిరి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్‌, ఎంపీడీవో పుష్పలీల, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు అన్నెపర్తి భిక్షం, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉస్మాన్‌, మండల యూత్‌ నాయకులు ఓడపల్లి మధు, అట్ల రంజిత్‌రెడ్డి, కొండవేని రాజు, సాయి, జటంగి రాజు, సింగారం పాండు, దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.