శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Sep 25, 2020 , 01:43:18

గ్రామీణ విత్తనోత్పత్తిపై అవగాహన

గ్రామీణ విత్తనోత్పత్తిపై అవగాహన

ఆత్మకూరు(ఎం) : గ్రామీణ విత్తనోత్పత్తిపై మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు ఏవో శిల్ప గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్వల్పకాలిక పంటల కోసం పీఆర్‌జీ 176 ఉజ్వల రకం కంది విత్తనాలు వాడాలని సూచించారు. సబ్సిడీ ద్వారా అందజేయనున్న విత్తనాలను ఎకరానికి 4 కిలోల చొప్పున వేయాలని సూచించారు. విత్తనాలు వేసిన రైతులందరూ సస్యరక్షణ పద్ధతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. అనంతరం గ్రామంలోని కంది పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్‌, సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు మండల కో-ఆర్డినేటర్‌ యాస ఇంద్రారెడ్డి, గ్రామ కో-ఆర్డినేటర్‌ నాతిరాజు, ఏఈవోలు రాజశేఖర్‌, మనోజ్‌కుమార్‌, సరిత, క్రాంతి, సౌమ్య, రైతులు మల్లారెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.