శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 18, 2020 , 02:27:42

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

 యాదాద్రిలో శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు ఆగమశాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఉదయాన్నే ఆలయంలో సుప్రభాత సేవ చేసిన అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మంటపంలో శ్రీసుదర్శననారసింహహోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు శ్రీస్వామివారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్‌ టికెట్‌ తీసుకొని శ్రీ సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు.  అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది.

ఖజానాకు రూ.1,20,108 ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 1,20,108 సమకూరినట్లు ఆలయ ఈవో గీతా తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ.550, ప్రసాదవిక్రయాలతో రూ.1,01,850, వాహనపూజల ద్వారా రూ. 1,800, టోల్‌గేట్‌తో రూ. 1,760, కొబ్బరికాయలతో రూ.11,100 కలిపి మొత్తం రూ.1,20, 108 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

VIDEOS

logo