శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 16, 2020 , 00:41:48

ఎయిమ్స్‌లో...కరోనా పరీక్షలు

ఎయిమ్స్‌లో...కరోనా పరీక్షలు

బీబీనగర్‌ : బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కొవిడ్‌ -19 ర్యాపిడ్‌ టెస్టులను ఉచితంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ వికాస్‌ బాటియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు చేసుకొనే బాధితులు ఒక రోజు ముందు 86852 95050 నంబర్‌కు కాల్‌ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో బాధితులు తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులను వెంట తెచ్చుకోవాలని కోరారు.

VIDEOS

logo