ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Sep 16, 2020 , 01:32:56

కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం

కార్యకర్తలను  కంటికిరెప్పలా కాపాడుకుంటాం

  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 
  • కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..
  •  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
  • ఇటీవల మరణించిన ఇద్దరు కార్యకర్తలకు రూ.2లక్షల బీమా పరిహారం
  • ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కుల అందజేత

ఆలేరు : టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కంటికిరెప్పలా కపాడుకునే బాధ్యత పార్టీపై ఉన్నదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త మంచాల యాదగిరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన మరో కార్యకర్త పారునంది చంద్రమ్మ పాముకాటుకు గురై మృతి చెందారు. దీంతో వీరి ఇద్దరికి పార్టీ నుంచి ఒక్కొక్కరికీ రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ చెక్కులు మంజూరు కాగా, మంగళవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృష్టి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సరైన సమయంలో సరైన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, ఎంపీటీసీ ఎర్ర పోచయ్య, రైతు బంధు సమితి జిల్లా డైరక్టర్‌ మిట్ట వెంకటయ్య, రామాజీపేట సర్పంచ్‌ మొగిలిపాక తిరుమలారమేశ్‌, జంగపల్లి సర్పంచ్‌ గుండ్ల సరితామల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని పలువురికి సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో అందజేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీనివాస్‌కు రూ.30 వేలు, జనమ్మకు రూ.60 వేలు, వంగపల్లి గ్రామానికి చెందిన రూ.25 వేలు, మాసాయిపేట గ్రామానికి చెందిన మేకల రాజయ్యకు రూ.14 వేలు, గుండ్లపల్లికి చెందిన కమలమ్మకు రూ.60 వేల చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, కౌన్సిలర్‌ సురేందర్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు గోర్ల పద్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణశాఖ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, రవీందర్‌గౌడ్‌, ఆండాలు పాల్గొన్నారు.

VIDEOS

logo