సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 13, 2020 , 00:24:53

ఉట్లోత్సవం

ఉట్లోత్సవం

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మూడోరోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు నరసింహాచార్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పూజలు చేశారు. అనంతరం బాలాలయం వెలుపల ఉట్లోత్సవం, బాలాలయంలో రుక్మిణీ కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయాధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo