బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 13, 2020 , 00:24:56

యాదాద్రిలో దర్శనాలు షురూ

యాదాద్రిలో దర్శనాలు షురూ

  • ఘనంగా నిత్య పూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో మూడురోజుల తర్వాత శనివారం భక్తులకు దర్శనాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మూడురోజులు దర్శనాలు నిలిపివేసిన అధికారులు శనివారం నుంచి భక్తులకు అనుమతి ఇచ్చారు. యాదాద్రి ఆలయంలో స్వామివారికి శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయా న్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అర్చనలు, అభిషేకం, సువర్ణపుష్పార్చన చేశారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతు కొనసాగింది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి స్వామి అమ్మవార్లకు మహానివేదన జరిపించి, అనంతరం శయనోత్సవం జరిపించారు. అలాగే పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా బాలాలయంలో నల్లనయ్యను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రీశుడికి రూ.1.56 లక్షల ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ సేవల ద్వారా శనివారం రూ.1.56,220 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,20,330, కొబ్బరికాయల ద్వారా రూ.14,400, వాహనపూజలతో రూ.4,700, ప్రచారశాఖ ద్వారా రూ.550, చెక్‌పోస్ట్‌ ద్వారా రూ.2,690, మినీబస్సు ద్వారా రూ.1400, ఇతర సేవలతో రూ.12,000 ఆదాయం వచ్చిందని తెలిపారు.

VIDEOS

logo