శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 12, 2020 , 00:11:20

గుట్ట పాత హైస్కూల్‌ గ్రౌండ్‌లో నేడు, రేపు కొవిడ్‌ పరీక్షలు

గుట్ట పాత హైస్కూల్‌ గ్రౌండ్‌లో నేడు, రేపు కొవిడ్‌ పరీక్షలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్ట బస్‌స్టాప్‌ సమీపంలో ఉన్న పాత హైస్కూల్‌ గ్రౌండ్‌లో శని, ఆదివారాల్లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాత స్కూల్‌ గ్రౌండ్‌ను పరిశీలించి మాట్లాడారు. కొవిడ్‌-19 నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారని, రెండు రోజులు పాటు పాత స్కూల్‌ గ్రౌండ్‌లోనూ విరివిగా పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో ప్రతి రోజు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. 

VIDEOS

logo