శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 11, 2020 , 00:19:56

వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంపూర్ణ మద్దతు

వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంపూర్ణ మద్దతు

  • ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బట్టు దాసురావు

వలిగొండ: అవినీతిలో కూరుకుపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను సీఎం కేసీఆర్‌ రద్దు చేయడం పట్ల టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బట్టు దాసురావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ ప్రక్షాలనలో భాగంగా సీఎం చేపట్టిన చర్యకు టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఎస్సీ వర్గీకరణ అంశం సీఎం కేసీఆర్‌ చేతుల్లోనే ఉందని, దీనిని కూడా త్వరలోనే పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

VIDEOS

logo