గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 10, 2020 , 01:02:26

యాదాద్రి ఆలయ పనుల పరిశీలన

యాదాద్రి ఆలయ పనుల పరిశీలన

  •  ముమ్మరంగా విగ్రహాల  ఏర్పాటు పనులు

యాదాద్రి, నమస్తేతెలంగాణ: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను బుధవారం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో  గీతారెడ్డి పరిశీలించారు. ఆలయ దక్షిణం వైపు జరుగుతున్న ఫ్లోరింగ్‌ పనులను పరిశీలించారు. ఆలయ ప్రాకారాలు, గోపురాలు శుభ్రం చేసే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాల పనుల వివరాలపై ఆరా తీశారు. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన ఐరావతం, సింహం, గరుడ విగ్రహాలు అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాకారాలపై అమర్చుతున్న రాతి పలకలు, పైకప్పుల గమ్మింగ్‌ పనులను సాంకేతిక కమిటీ సభ్యులు పరిశీలించారు.

శివాలయంలో కల్యాణ మంటపం

శివాలయంలో కల్యాణ మంటపం పనులు వేగంగా జరుగుతున్నాయి. శివాలయం, ఉప ఆలయాల నిర్మాణం దాదాపు పూర్తికాగా కల్యాణ మంటపం పనులు ఇటీవలే ప్రారంభించారు. కల్యాణ మంటపం పక్కనే రథ మంటపాన్ని నిర్మించనున్నారు.


VIDEOS

logo