గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Sep 10, 2020 , 01:02:26

కరోనా భయం కనబడని జనం

కరోనా భయం కనబడని జనం

  • యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత 
  • నిర్మానుష్యంగా ఆలయ పరిసరాలు 
  • గుట్టలో నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 

  • భక్తులకు దర్శనాల నిలిపివేత

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్యపూజలు నిర్వహించారు.  వేకువజామున  బాలాలయంలోని కవచమూర్తులకు ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీదళాలతో అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహుడిని మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు జరిగాయి. మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. కొండపై ఉన్న శివాలయంలో శైవ సంప్రదాయంగా నిత్యారాధనలు కనులపండువగా నిర్వహించారు. అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన చేశారు. 


  • బోసిపోయిన బాలాలయం

కొవిడ్‌ నేపథ్యంలో మూడు రోజల పాటు భక్తులకు దర్శనాలు నిలిపివేయడంతో కొండపైన పరిసరాలు, బాలాలయం భక్తులు లేక వెలవెలపోయింది. అర్చకులు,  సిబ్బంది మాత్రమే హాజరై స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 

  •  ‘ప్రహ్లాదుడి చరిత్ర’

అత్యద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ గర్భగుడి గోడకు ప్రహ్లాదుడి చరిత్రను తెలిపే ఘట్టాలు ముద్రించిన రాగి రేకులను అమర్చారు. వీటి అమరిక ఇటీవలే పూర్తయింది.   ద్వారం తలుపులకు బంగారు తొడుగులు అమర్చే పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇవి పూర్తయితే గర్భాలయం శోభాయమానంగా కనిపించనున్నది.


logo