ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Sep 04, 2020 , 05:23:30

నిత్యపూజలు

 నిత్యపూజలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవ అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించారు. తులసీదళాలు, పుష్పాలతో అర్చించారు. మంటపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు. 

రూ.2.17 లక్షల ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 2,17,285 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,83,100, కొబ్బరికాయలు రూ.18,000, వాహనపూజలు రూ. 9,000, ప్రధాన బుకింగ్‌ రూ.1500, ప్రచారశాఖ రూ.1375, టోల్‌గేట్‌ రూ.1510, అన్నదాన విరాళం రూ.1700, మినీబస్సు రూ,1,100 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

VIDEOS

logo