ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Sep 03, 2020 , 00:02:26

పాలిసెట్ ప్ర‌శాంతం

పాలిసెట్ ప్ర‌శాంతం

  • కొవిడ్‌ నిబంధనలతో ప్రవేశ పరీక్ష 
  • కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు 
  • 76.4 శాతం హాజరు 

భువనగిరి అర్బన్‌: పాలి టెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన ఎంట్రన్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పాలిసెట్‌ ఎంట్రన్స్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.నాకోటి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు కొవిడ్‌ నిబంధనల మేరకు భువనగిరి పట్టణంలో మూడు, యాదగిరిగుట్టలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలలో 450 మంది విద్యార్థులకు, 338 హాజరుకాగా, 112 విద్యార్థులు గైర్హాజరు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 245 మంది విద్యార్థులకు 170 మంది విద్యార్థులు హాజరు కాగా, 75 మంది గైర్హాజరు, నవభారత్‌ కళాశాలలో 242 మంది విద్యార్థులకు 200 హాజరుకాగా, 42 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగాయని, పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనల ప్రకారం విద్యార్థులు మాస్కులు ధరించి హాజరయ్యారన్నారు. విద్యార్థులను పరీక్షల కేంద్రాల్లోకి పంపించేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయగా సాధారణ టెంపరేచర్‌ ఉందని తెలిపారు.  

యాదగిరిగుట్టలో... 

యాదాద్రి, నమస్తేతెలంగాణ: యాదగిరిగుట్ట పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో బుధవారం పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 181 మంది విద్యార్థులకు గానూ  138 మంది పరీక్షకు హాజరు కాగా, 43 మంది గైర్హాజరయ్యారు. ఈ సెంటర్‌లో 20 బాలురు, 23 మంది బాలికలు పరీక్ష రాయలేదు. 87 మంది బాలురు, 51 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ సెంటర్‌లో మొత్తం 83 మంది విద్యార్థులకు గాను 52 మంది బాలురు, 20 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. 8 మంది బాలురు, 3 బాలికలు గైర్హాజరయ్యారు. రెండు సెంటర్లలో కలిసి 20.4 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒక విద్యార్థిని పాలిటెక్నిక్‌ కళాశాల సెంటర్‌కు 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదని అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు
.

VIDEOS

logo