గురువారం 04 మార్చి 2021
Yadadri - Sep 01, 2020 , 01:49:45

రేపు పాలిసెట్‌

రేపు పాలిసెట్‌

  • పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

భువనగిరి అర్బన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో  ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఈనెల 2న ఎంట్రెన్స్‌ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరీక్ష నిర్వహణ కోసం జిల్లా కో-ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ కావడంతో  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీలక్ష్మీనర్సింహస్వామి కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాకోటి శ్రీనివాస్‌ తెలిపారు. 

జిల్లాలో మూడు సెంటర్లు...

జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయగా అందులో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కళాశాలలో 450 మంది విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 245 మంది, నవభారత్‌ కళాశాలలో 242 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.  పరీక్ష ఉద యం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తారు. పరీక్షకు గంట ముందుగా చేరుకోవాలి.  నిమిషం ఆలస్యమైతే అనుమతించరు. విద్యార్థులు  హెచ్‌బీ పెన్సిల్‌, ఎరేజర్‌, హాల్‌ టికెట్‌, బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమించారు. 

పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు...

పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు మాస్కు ధరించి పరీక్షకు హాజరుకావాలి. పరీక్ష కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ప్రతి గదిలో 20 నుంచి 25 మందిని అనుమతిస్తారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి పంపించేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు.విద్యార్థులకు టెంపరేచర్‌ 95 నుంచి 99 వరకు ఉండాలి, 100 నుంచి 101, 102 ఉంటే ప్రత్యేక గది ఏర్పాటు చేసి పరీక్షకు అనుమతిస్తారు. 

VIDEOS

logo