సోమవారం 19 అక్టోబర్ 2020
Yadadri - Sep 01, 2020 , 01:49:45

కరోనా .. వ‌ద్దు హైరానా

కరోనా .. వ‌ద్దు హైరానా

వలిగొండ : మండలంలో 183 మందికి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 64 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 73 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి, వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చిందన్నారు.  

బీబీనగర్‌లో 25 మందికి..

బీబీనగర్‌ : మండలంలోని బీబీనగర్‌, కొండమడుగు  పీహెచ్‌సీలల్లో  126 మందికి టెస్టులు చేయగా 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. 

భూదాన్‌పోచంపల్లిలో ఆరుగురికి..

భూదాన్‌పోచంపల్లి : మండలకేంద్రంలో కరోనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. 

ఆత్మకూరు(ఎం)లో 8 మందికి..

ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 42 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌..

ఆత్మకూరు(ఎం)తో పాటు కూరెళ్లలో విధించిన లాకడౌన్‌ సోమవారం కొనసాగింది. నిర్ణీత సమయాల్లో మాత్రమే వివిధ రకాల వ్యాపారులు తమ దుకాణాలను తెరిచి ఉంచారు. లాక్‌డౌన్‌ సమయంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి కొవిడ్‌ నిబంధనలు పాటించారు.  

తుర్కపల్లిలో ఏడుగురికి..

తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. 

బొమ్మలరామారంలో ముగ్గురికి..

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ తెతిపారు.

రాజాపేటలో నలుగురికి..

రాజాపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు. 

మోటకొండూర్‌లో ఇద్దరికి..

మోటకొండూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కేంద్రంతో పాటు, పలు మండలాలకు చెందిన 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ తెలిపారు. ఇందులో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు, ఆలేరు మండలానికి చెందిన ఇద్దరు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఆలేరులో 24 మందికి..

ఆలేరు టౌన్‌ : మండలంలో 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌ వచ్చిందని శారాజీపేట పీహెచ్‌సీ ఇన్‌చార్జీ డాక్టర్‌ రాజేందర్‌ తెలిపారు. 

యాదగిరిగుట్టలో ఐదుగురికి..

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 54 కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. ఇందులో యాదగిరిగుట్టకు చెందిన నలుగురు, గుండ్లపల్లికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట టౌన్‌ సీఐకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.

సంస్థాన్‌నారాయణపురంలో 11 మందికి..

సంస్థాన్‌నారాయణపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 47 మందికి కరోనా పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాదికారి దీప్తీ తెలిపారు. పాజిటివ్‌ వచ్చినవారికి ప్రభుత్వం అందించిన మెడికల్‌ కిట్లు అందజేసి హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. 

అడ్డగూడూరులో 12 మందికి..

అడ్డగూడూరు : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 68 మందికి కరోనా ర్యాపిడ్‌  పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు.

రామన్నపేటలో 48 మందికి..

రామన్నపేట : మండలంలో 48 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 91 మందికి పరీక్షలు చేయగా 28 మంది, మునిపంపుల ప్రాథమిక ఆరోగ్యకేద్రంలో 53 మందికి పరీక్షలు నిర్వహించగా 20మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 

మోత్కూరులో....

మోత్కూరు : మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి కిశోర్‌కుమార్‌ తెలిపారు.


logo