సోమవారం 08 మార్చి 2021
Yadadri - Aug 31, 2020 , 00:50:39

ప్రాకారాల‌పై ప‌ల‌క‌ల అమ‌రిక‌

ప్రాకారాల‌పై ప‌ల‌క‌ల అమ‌రిక‌

  • విద్యుత్‌, కేబుల్‌ వైర్ల కోసం పైప్‌లైన్ల ఏర్పాటు

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టు నిర్మించిన ప్రాకారాలపైన నల్లరాయి పలకలను అమర్చుతున్నారు. కృష్ణశిలలతో ‘యూ’ ఆకారంలో  రూపొందించిన పలకలను ప్రాకారాలపై ఏర్పాటు చేస్తున్నారు. వీటి అమరికతో  ప్రాకారాలకు మరింత శోభ చేకూరడంతోపాటు పైన వర్షపు నీరు నిల్వకుండా వెంటనే కిందికి జారిపోతుంది. దీంతో నల్లరాయి శిలల జాయింట్ల మధ్య నుంచి నీరు లీకయ్యే ప్రమాదం కూడా తప్పుతుంది.

కేబుల్‌ కోసం పైప్‌లైన్లు..

ప్రధాన ఆలయంలోకి ఎలక్ట్రికల్‌, ఇతర కేబుల్‌ వైర్లను తీసుకెళ్లడానికి ఆలయ ఉత్తర భాగం నుంచి పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలోంచి కేబుల్‌ వైర్లను తీసుకెళ్తారు. వర్షానికి నేల తడిసినా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ వైర్ల పనులు చేపడుతున్నారు. నాలుగైదు వరుసల్లో సిమెంట్‌ పైపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా కేబుల్‌ వైర్లను ఆలయంలో అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

VIDEOS

logo