యాదాద్రిలో ఘనంగా నిత్య పూజలు

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. ఉదయం సుప్రభాత సేవ, నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు సమర్పించారు. ఘనంగా సుదర్శన హోమం జరిపారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. దేవేరులను అందంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ కల్యాణ తంతు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అందంగా ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలోనే భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ వేడుక జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా శ్రీవారి కైంకర్యాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.
శివాలయంలో చవితి వేడుకలు
యాదాద్రి కొండపై ఉన్న శివాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఆదివారం ఉదయం ఘనంగా పూజలు చేశారు. శివాలయ అర్చకులు నర్సింహమూర్తి ఆధ్వర్యంలో గణపతికి నైవేద్యం సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం తర్వాత వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి కొండకింద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.
2న హుండీ లెక్కింపు..
ఆలయంలో ఉన్న హుండీల్లో భక్తులు వేసిన కానుకలు, నగదును సెప్టెంబర్ 2వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయాధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు బాలాలయంలో సిబ్బంది కానుకల లెక్కింపును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తొలుత ఈనెల 31న హుండీ కానుకలు లెక్కించనున్నట్లు ప్రకటించినప్పటికీ, సోమవారం కాకుండా బుధవారం లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారలు తెలిపారు.
యాదాద్రీశుడికి రూ.5.84లక్షల ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.5,84,812 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.4,89,200, కొబ్బరికాయలతో రూ.50,190, వాహనపూజల ద్వారా రూ.21,200, చెక్‌పోస్ట్ ద్వారా రూ.4,060, ప్రచారశాఖ ద్వారా రూ.4,690, అన్నదాన విరాళం ద్వారా రూ.11,232, మినీ బస్సుల ద్వారా రూ.1,640, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,600 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఏడుగురు మృతి
- ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
- రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు
- మినీ డ్రెస్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్..ఫొటోలు హల్చల్
- 'ఈ కథలో పాత్రలు కల్పితం' రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి తలసాని
- ఒక్క ఫిబ్రవరిలోనే రూ.23,663 కోట్ల విదేశీ పెట్టుబడులు
- పెరుగు నిజంగా జీర్ణక్రియలో సహాయపడుతుందా?