గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 30, 2020 , 06:17:25

ఆలయానికి చేరిన కొత్త విగ్రహాలు

ఆలయానికి చేరిన కొత్త విగ్రహాలు

  • కొనసాగుతున్న సాయిల్‌ స్టెబిలైజింగ్‌ పనులు

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి కొండపై పునర్నిర్మితమవుతున్న ఆలయంలో ఏర్పాటు చేయడానికి నల్లరాయితో చెక్కిన నాలుగు విగ్రహాలను శనివారం డీసీఎంలో కొండపైకి తీసుకువచ్చారు. వీటిలో రెండు గరుడ్మంతుడి, రెండు ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఆలయంలో ఇప్పటికే కృష్ణ శిలలతో చెక్కిన శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు.


పటిష్టంగా సాయిల్‌ స్టెబిలైజింగ్‌ పనులు

ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున సాయిల్‌ స్టెబిలైజింగ్‌ పనులు చేపడుతున్నారు. మట్టి కుంగిపోయిన ప్రాంతంలో బోరు యంత్రంతో సుమారు రెండు వందల వరకు రంధ్రాలు తీసి సిమెంట్‌ కంకరతో పూడ్చారు. వాటిపై ఆర్‌సీసీతో బీములు వేస్తున్నారు. పటిష్టంగా స్టెబిలైజింగ్‌ చేసి దీనిపై నల్లరాయి బండలతో ఫ్లోరింగ్‌ పనులు చేపట్టనున్నారు. కాగా దక్షిణం వైపు మినహా ఆలయం లోపల, వెలుపల ఫ్లోరింగ్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. 


VIDEOS

logo