భూ బహుమతి

- n పట్టా పాస్ పుస్తకంతో జీవితానికి భరోసా
- n గుంట భూమి ఉన్నా రైతు బీమా వర్తింపు
- n వ్యవసాయ కుటుంబాల్లో మారిన ఆలోచన ధోరణి
- n జిల్లాలో జోరందుకున్న పట్టాల మార్పిడి
- n ప్రతి ఏటా పెరుగుతున్నగిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు...
- n రెండున్నరేండ్లలో జిల్లాలో జరిగిన గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్లు 14,237
‘గుంట భూమి ఉంటే చాలు.. గుండె మీద చేయేసుకుని కులాసాగా బతకొచ్చు...’ ఇదీ రైతు కుటుంబాల్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బీమా’, ‘రైతు బంధు’ పథకాలు అనేక కుటుంబాల్లో ఆలోచనా విధానాన్ని మార్చింది. ‘భూమి పంచి ఇచ్చినా.. పట్టా మాత్రం చేయను..’ అనే మాట నుంచి ‘మంచిగున్నప్పుడే ఎక్కడిదక్కడ చేయాలె’ అనే దృక్పథాన్ని తీసుకొచ్చింది. గుంట భూమి ఉన్న ప్రతి రైతు జీవితానికి ‘బీమా’తో భరోసానిస్తున్నది సర్కారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పట్టాల మార్పిడి జోరందుకున్నది. గతంలో కంటే గడిచిన మూడేండ్ల కాలంలో పట్టాల మార్పిడి విపరీ తంగా పెరిగింది. ఇందులో సేల్ డీడ్ల కంటే గిఫ్ట్డీడ్లే అధికంగా ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూరు మున్సి పాలిటీల పరిధిలో గడిచిన రెండున్నరేండ్ల లోనే 14,237 గిఫ్ట్‌డీడ్ రిజి స్ట్రేషన్లు జరగడం విశేషం.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుబంధు పథకానికి నిబంధనలు అంటూ ఏమీలేవు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు ఉండి కనీసం గుంట భూమితో పాసుపుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకూ తెలంగాణ ప్రభుత్వం బీమాను వర్తింపజేస్తున్నది. ఏదేని కారణంతో రైతు చనిపోతే పది రోజుల్లోనే వారి కుటుంబసభ్యులకు ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం రూ.5లక్షలను బాధిత కుటుంబానికి అందిస్తున్నది. అలాగే రైతుబంధు సాయం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలను రైతులకు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా భూమి ఉన్న కుటుంబానికి ప్రతిఏటా రూ.6వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. వీటితోపాటు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిపొందాలన్నా.. కుటుంబసభ్యుల్లోని ప్రతిఒక్కరి పేరిట భూములు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతులు తమకు ఉన్న వ్యవసాయ భూముల్లో కొంత భూమిని తమ పిల్లలకు, కుటుంబసభ్యులకు గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో జిల్లాలో గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇతరుల నుంచి భూమిని కొనుగో లు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 9 శాతం వరకు స్టాంప్ డ్యూటీ రుసుం చెల్లించాలి. అదే బహుమానం గా రాసి ఇస్తే 3 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఖర్చు లు కూడా తగ్గుతుండటంతోనే ఎక్కువగా రైతులు గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. బీమా పథకం ప్రారంభమైన 2018 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 4,174 గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్లు జరిగితే 2019లో ఆ సంఖ్య 5,924కి చేరింది. 2020 సంవత్సరంలో ఆగస్టు నెల నాటికే ఈ తరహా రిజిస్ట్రేషన్లు 4,139 జరగడం విశేషం.
963 మంది రైతు కుటుంబాలకు లబ్ధి..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బీమా’ పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నది. వివిధ కారణాలతో మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున అందిస్తున్న పరిహారం ఆయా కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపుతున్నది. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమాను వర్తింపజేస్తున్నది. ఆరంభంలో ఒక్కో రైతుకు రూ.2,271 చొప్పున చెల్లించిన ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి రూ.3,457కు పెంచింది. రైతు బీమా పథకాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో 2020 ఆగస్టు 13వ తేదీ వరకు ఈ పథకం కింద రైతులకు బీమా వర్తించనున్నది.
వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం..
జిల్లా వ్యాప్తంగా 1,00,711 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరయ్యాయి. ఇప్పటికే 70వేల మంది రైతులకు సంబంధించి పాసు పుస్తకాలను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు వారిని రైతు బీమాకు అర్హులుగా గుర్తించారు. మిగిలిన 37 వేల మంది రైతులకు సంబంధించిన పాసు పుస్తకాల పరిశీలన కొనసాగుతోంది. ఇది పూర్తయితే జిల్లా వ్యాప్తంగా రైతుబీమా అర్హుల సంఖ్య పెరగనున్నది. 2018-19లో జిల్లాలో 963 మంది రైతు కుటుంబాలకు రైతు బీమాతో లబ్ధిపొందాయి. 2018-19లో 569 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, 555 కుటుంబాలకు వారం రోజుల్లోనూ రూ.5లక్షల చొప్పున బీమా సొమ్ము అందింది. 2019-20లో 502 మంది రైతులు చనిపోగా, 408 మంది రైతు కుటుంబాలు బీమా ద్వారా లబ్ధిపొందాయి.
జిల్లాలో ఐదు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో
గత రెండున్నరేండ్లలో జరిగిన గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ల వివరాలు
రిజిస్ట్రేషన్ కార్యాలయం 2018 2019 2020
భువనగిరి 831 1,014 1,386
చౌటుప్పల్ 839 1,461 756
బీబీనగర్ 632 824 615
యాదగిరిగుట్ట 945 1,101 433
మోత్కూరు 927 1,524 949
జిల్లాలో రైతుబీమాతో గడిచిన రెండేండ్లలో లబ్ధిపొందిన
రైతు కుటుంబాల వివరాలు..
సంవత్సరం మృతి చెందిన రైతులు బీమా అందుకున్న కుటుంబాలు
2018-19 569 555
2019-20 502 408
తాజావార్తలు
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు