యాదాద్రీశుడికి రూ.3.47 లక్షల ఆదాయం

యాదాద్రి, నమస్తేతెలంగాణ :యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 3,47,408 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.2,82,290, కొబ్బరికాయలతో రూ. 27వేలు, వాహనపూజలతో రూ.13,100, చెక్‌పోస్టు ద్వారా రూ.3,140, ప్రచారశాఖ ద్వారా రూ.7,985, అన్నదాన విరాళం ద్వారా రూ.2,227, ఇతర సేవలతో రూ. 1,100, ప్రధాన బుకింగ్ నుంచి రూ.400, శాశ్వత పూజల ద్వారా రూ.10,116 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆలయ పనుల పరిశీలన : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ శంకర్‌నాయక్, అర్కిటెక్ట్ ఆనందసాయి తదితరులు శనివారం పరిశీలించారు. ప్రధాన ఆలయం లోపల చేపడుతున్న తుదిదశ పనులు, ఎలక్ట్రికల్ వర్క్స్, బయట జరుగుతున్న ఫ్లోరింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ గోపురాలకు తుది మెరుగులు, ప్రాకార సాలహారాల్లో శిల్పాల ఏర్పాటు తదితర పనుల వివరాలను స్థపతులు వేలు, గణేశ్‌లను అడిగి తెలుసుకున్నారు.