Yadadri
- Aug 30, 2020 , 00:10:07
VIDEOS
ఘనంగా లక్షపుష్పార్చన

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి శాస్ర్తోక్తంగా నిత్య పూజలు చేశారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అర్చనలు, అభిషేకం, పుష్పార్చన చేపట్టారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతు కొనసాగింది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి వేళ స్వామి అమ్మవార్లకు మహా నివేదన జరిపించి, అనంతరం శయనోత్సవం జరిపించారు.
తాజావార్తలు
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
MOST READ
TRENDING