గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Aug 28, 2020 , 00:15:21

పనుల్లో వేగం పెరగాలి

పనుల్లో వేగం పెరగాలి

  • ఆలయ పనులు పరిశీలించిన ఆర్కిటెక్ట్‌ ఆనంద సాయి

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి ఆలయ తుదిదశ పనులు వేగంగా, నాణ్యతతో చేపట్టాలని ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి స్థపతులు, కాంట్రాక్టరు, అధికారులకు సూచించారు. గురువారం స్థపతులు, అధికారులతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయంలో కృష్ణ శిలలకు రసాయనాల పూత, ప్రాకారాల సాలహారాల్లో ఏర్పాటు చేయాల్సిన కృష్ణుడి వివిధ రూపాల విగ్రహాలపై చర్చించారు. ఆలయం దక్షిణం వైపున చేపడుతున్న ఫ్లోరింగ్‌, సాయిల్‌ స్టెబిలైజింగ్‌ పనులను పరిశీంచారు. ఆలయంలో జరుగుతున్న ఎలక్ట్రికల్‌ పనులను వైటీడీఏ విద్యుత్‌ అధికారి రామారావు పరిశీంచారు. 

యాదాద్రీశుడి చెంతన ఉప ఆలయాలు

యాదాద్రి కొండపై కృష్ణ శిలలతో పునర్నిర్మితమవుతున్న ప్రధాన ఆలయంలో ఉప ఆలయాలు కృష్ణ శిలలతో అందంగా రూపుదిద్దుకున్నాయి. ప్రధాన ఆలయ ముఖ మంటపంలో ఆండాళ్‌దేవి, రామానుజులు, ఆళ్వారు లు, ఆంజనేయ స్వామి మంటపాలతో పాటు శయన మంటపం నిర్మించారు. భక్తుల ఆరాధ్య దైవం నారసింహుడిని దర్శించుకున్నాక అమ్మవారిని వైష్ణవ ఆరాధ్యులు నమ్మాళ్వార్లు, రామానుజులను తిలకించేలా ఉప ఆలయాలుగా తీర్చిదిద్దుతున్నారు. గర్భాలయానికి ఎదురుగా రామానుజులు, నమ్మాళ్వారుల మందిరాలు నిర్మించారు.


logo