బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 27, 2020 , 23:20:16

డిజిటల్‌ పద్ధతిలో విద్యాబోధన చేయాలి

డిజిటల్‌ పద్ధతిలో విద్యాబోధన చేయాలి

భువనగిరి కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్‌ పద్ధతిలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాబోధన చేపట్టేందుకు ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాఠ్యప్రణాళికలు రూపొందించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు.గురువారం గూగుల్‌ మీట్‌ ద్వారా మండల రిసోర్స్‌ ఆఫీసర్లు, డీఈవో, ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్‌ పద్ధతిలో టీసాబ్‌, దూరదర్శన్‌ విద్యాబోధన, మొబైల్‌ ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్‌ డివైస్‌ లేని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి ఉండాలన్నారు. డిజిటల్‌ పద్ధతిలో విద్యాబోధన చేపట్టేటప్పుడు నిరంతర విద్యుత్‌ సదుపాయం ఉండేందుకు విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌-19 దృష్ట్యా పాఠశాలలు తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలన్నారు. ఇందుకు సర్పంచులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

మండల కోఆర్డినేటర్‌ ఆఫీసర్లతో మాట్లాడుతూ గ్రామాల వారీగా పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, తడిపొడి చెత్త షెడ్‌, క్లస్టర్‌ వారీగా రైతు వేదికలను పూర్తి చేసి అమల్లోకి తేవాలన్నారు. రైతు వేదికలపై ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. గుండాల, మోత్కూర్‌, రామన్నపేట, వలిగొండ, అడ్డగూడూరు, ఆలేరు పల్లెపకృతి వనాలను మండల కోఆర్డినేటర్‌ అధికారులు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కీమ్యానాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డివో పీడీ ఉపేందర్‌రెడ్డి, డీఈవో చైతన్యజైనీ, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo